- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్లీ లీడర్ల పెత్తనంతో అధికారులకు తలనొప్పి
దిశ ప్రతినిధి, మేడ్చల్: నగరశివారు మున్సిపల్ కార్పొరేషన్ల పై గల్లీ లీడర్ల పెత్తనం పెరిగిపోతోంది. కొందరు కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో విధులు నిర్వహించలేమంటూ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పన్ను నిర్ణయం, కొత్త నిర్మాణాలకు అనుమతులివ్వాలని అధికారులపై ఒత్తిళ్లు చేయడం పరిపాటిగా మారుతోంది. ఇప్పటికే పలుసార్లు కౌన్సిలర్లుగా గెలువడంతో ఇక తమకెవరూ ఎదురు లేరనే ధీమాతో కనిపిస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
మున్సిపల్ పాలనపై పట్టు సాధించిన నేతలు ఆయా విభాగాల్లో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ము ఖ్యంగా అస్తి పన్ను నిర్ణయం, వసూళ్లలో కార్పొరేటర్ల జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మేడ్చల్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన జంట కార్పొరేషన్లలో వ్యాపార వా ణిజ్య సముదాయాలు పెద్ద ఎత్తున వెలిశా యి. ఇక్కడ అక్రమ వ్యాపారాలు సైతం జోరుగా సాగుతున్నాయి. అధికారులు అలాంటి వాణిజ్య సముదాయాలకు పన్నులు వేసినా.. జరినామాలు విధించినా.. అక్రమ వ్యాపారాలను కట్టడి చేసేందుకు యత్నించినా.. వాటిపై చర్యలకు ఉప క్రమిస్తున్నట్లు తెలిస్తే చాలు.. కొందరు కార్పొరేటర్లు ఆగమేఘాల మీద ము న్సిపల్ కార్యాలయాల వద్ద కు పరుగులు పెడుతున్నారు. అక్రమార్కులకు అండగా నిలబ డు తూ..ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఇంటి నిర్మాణాల్లోనూ జోక్యం..
ఇంటి నిర్మాణాల్లోనూ కార్పొరేటర్ల జోక్యం పెరిగిపోయిందని అధికారులు వాపోతున్నారు. భ వన నిర్మా ణం మొదలైనప్పటి నుంచి పూర్త య్యే వరకు అవసరమైన అనుమతులు ఇప్పిస్తామంటూ ఇంటి యాజమానులతో డీల్ కుదుర్చుకుంటున్నారు.ఇటీవల బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి లో ఓ ఇంటి యాజమాని రోడ్డును అక్రమించుకొని నిర్మి స్తున్నా.. కూల్చ కుండా ఓ కార్పొరేటర్ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం.
సమావేశాల్లో రసాభాస..
చెప్పిన మాట వినకుంటే మున్సిపల్ సమావేశాల్లో రసాభాస చేయడం నేతలకు మామూలుగానే మారిపోయింది. ఇటీవల జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ అక్రమ నిర్మాణం కూల్చివేత పెద్ద దు మారాన్నే రేపింది.ఈ సందర్భంగా జరిగిన పెట్రోల్ దాడిలో సీఈ బిక్షపతి రావు గాయాల పాలైన విషయం విషయం విదితమే..అయితే సదరు నిర్మాణదారుడు ఆ గదిని నిర్మించుకునేందుకు ఓ కార్పొరేటర్ సహకరించినట్లు తెలుస్తోంది.
కార్పొరేటర్లు ఇష్టానుసారంగా వ్యవహారించడం….బేదిరింపులకు పాల్పడడంతో తమకెందుకులే అనే ధోరణి అధికారులల్లో ఉండడంతో అవినీతి అక్రమాలకు దారితీస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేటర్ల బెదిరింపులకు కొందరు అధికారులు సెలవుల్లోకి వెళ్లడం లేదా బదిలీ చేయించుకొని వెళ్లిపోవడం జరుగుతుందని ఓ అధికారి వెల్లడించారు.
లక్షలు పోసి గెలిచాం..
మున్సిపల్ ఎన్నికల్లో లక్షల రూపాయాలు ఖర్చు చేసి గెలిచామని అధికారులు చూసి చూడనట్లు ఉంటేనే నాలుగు పైసలు వెనకేసుకునే అవకాశం ఉంటుందని నేరుగా అధికారులతో మాట్లాడడం కనిపిస్తోంది. అ యినా అధికారులు సహకరించకుంటే ఎదో తప్పులో ఇరికించి తరిమేసే ప్రయత్నాలు చేయడం సర్వసాధారణమే.పలు కార్పొరేషన్లలో కొన్నేళ్లుగా తప్పుడు లెక్కలతో ఆస్తి పన్నుకు ఎగనామం పెడుతున్నట్లు ఆ రోపణలు వినిపిస్తున్నాయి.
ఆధునిక, సాధారణ, పు రాతన నిర్మాణాలకు వేర్వేరుగా పన్ను వసూలు చే స్తారు. అయితే శివారు కార్పొరేషన్లలో ఇటీవల చేపడుతున్న గృహాలన్నీ దాదాపుగా అధునిక నిర్మాణ లే…అయినప్పటికీ ఆస్తి పన్నును తగ్గించుకునేందుకు సాధారణ నిర్మాణాలు గా చూపుతూ పన్నులకు ఎగ నామం పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. డివిజన్లలో తమ గెలు పునకు సహకరించిన ఇంటి యజమానులతో స్వల్ప మొత్తంలో పన్నలు విధించాలంటూ అధికారులను ఆదేశిస్తున్నట్లు ఓ అధికారి వాపోయారు. ఇకనైనా మున్సిపల్ పాలనపై ఉన్నతాధికారులు దృష్టి సారి స్తేనే గాడిలోపడే అవకాశం ఉందన్నవాదనలు వినిపిస్తున్నాయి.