SRH vs KKR మ్యాచ్.. అందరి కళ్లు ఆ బ్యూటీపైనే

by Shyam |
Kaviya Maran
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో టాక్ ఆఫ్ ది సిటీగా మారిపోయింది ఒక యువతి. ఆదివారం SRH, KKR జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా టీవీ కెమెరాలు ఒక యువతిపై ఫోకస్ పెట్టాయి. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ అవుటైనప్పుడు కేరింతలు కొడుతూ కనపడిన ఆ యువతి.. ఆ తర్వాత మ్యాచ్ ముగిసే వరకు టీవీ స్క్రీన్లపై అట్రాక్షన్‌గా మారింది. అయితే ఇంతకు ఆ యువతి ఎవరని అందరూ చర్చించుకున్నారు. కొంత మంది గూగుల్ వేదికగా సెర్చింగ్ మొదలు పెట్టారు. ఇంతకు ఆ యువతి ఎవరంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో, సన్‌నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కూతురైన కావ్యా మారన్ ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ సీఈవో వ్యవహరిస్తున్నారు. సన్ గ్రూప్‌లోని మ్యూజిక్ ఛానల్స్, ఎఫ్ఎం రేడియోలో ఆమెకు వాటాలున్నాయి. క్రికెట్ అంటే అమితాసక్తి కలిగిన ఆమెను సీఈవో నియమించారు. ఇటీవల జరిగిన వేలం పాట సమయంలో కూడా కావ్య టీవీల్లో కనపడ్డారు.

Kaviya Maran, Sunrisers

Advertisement

Next Story