- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీఎస్టీ వసూళ్ల కొరత రూ. 2.35 లక్షల కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: వస్తువుల, సేవల పన్ను (GST) వసూళ్లలో కొరత 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.35 లక్షల కోట్లని గురువారం ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ కారణంగా జీఎస్టీ (GST) వసూళ్లు ఈ ఏడాది తీవ్రంగా ప్రభావితమయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ 41వ సమావేశం (41st Meeting of the GST Council)లో తెలిపారు. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టాలను భర్తీ చేసుకునేందుకు జీఎస్టీ (GST)పరిహారాన్ని ఇవ్వాలంటూ రాష్ట్రాలు ఒత్తిడి చేయడంతో గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ. 3 లక్షల కోట్ల జీఎస్టీ పరిహారం (GST compensation) ఇవ్వాల్సి ఉండగా, కరోనా వల్ల రూ. 65 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చే వీలుందన్నారు. ఇక, పరిహారం చెల్లించాల్సిన దానిపై రాష్ట్రాల ముందు కేంద్రం రెండు ప్రతిపాదనలను ఉంచింది. ఒకటి.. ఆర్‌బీఐ (RBI) నుంచి తక్కువ వడ్డీతో రుణాలను పొందడం, రెండు.. ప్రత్యేక ఏర్పాటుతో రూ. 2.35 లక్షల కోట్లను అందించడం. ఈ రెండు ప్రతిపాదనలపై వారం రోజుల్లోగా అభిప్రాయాలను చెప్పాలని కేంద్రం కోరింది. ఈ మొత్తం లోటులో రూ. 97 వేల కోట్లు జీఎస్టీ (GST) వల్ల ఏర్పడిందని, మిగిలిన లోటు కరోనా ప్రభావం వల్లనేనని ఆర్థిక రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు.