ఆ విద్యార్థులు అంత నీచంగా ఆలోచించారా.. గుట్టు బయటపెట్టిన గ్రూప్ చాట్

by Sumithra |   ( Updated:2021-04-09 06:31:13.0  )
ఆ విద్యార్థులు అంత నీచంగా ఆలోచించారా.. గుట్టు బయటపెట్టిన గ్రూప్ చాట్
X

దిశ, వెబ్‎డెస్క్: నేటి ఆధునిక సమాజంలో అమ్మాయిలకు కనీస విలువ అనేదే లేకుండా పోతుంది. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులు చెడు ఆలోచనలతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. 12వ తరగతి చదివే ఓ ఇద్దరు విద్యార్థులు సోషల్ మీడియాలో స్కూల్ గ్రూప్ క్రియేట్ చేసి, మన క్లాస్‎లో ఎవ్వరిని చూస్తే మీకు రేప్ చేయాలనిపిస్తుందో… చెప్పాలంటూ పోల్ నిర్వహించడమే కాకుండా రేటింగ్‎లు కూడా ఇచ్చారు. ఈ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలియడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.

ఈ దారుణం ఆస్ట్రేలియాలోని లాన్సెస్టన్ చర్చ్ గ్రామర్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ గ్రూప్ చాట్‌లో సుమారు 20 మందికి పైగా విద్యార్థులు ఉండగా అందులో ఇద్దరు 12వ తరగతి చెందిన వారు. ఆ ఇద్దరు ‘మోస్ట్ రేపబుల్ గర్ల్స్’ అనే జాబితాను తయారు చేసి.. మీకు మన క్లాస్‌లో ఏ అమ్మాయిని రేప్ చేయాలనిపిస్తుంది అంటూ… నీచంగా చాటింగ్ చేశారు. ఈ విషయాన్ని గ్రూప్‎లో ఉన్న మరికొందరు స్క్రీన్ షాట్స్ ద్వారా టీచర్స్‎కు ఫిర్యాదు చేయడంతో.. స్కూల్ యాజమాన్యం ఆ ఇద్దరు విద్యార్థులను స్కూల్ నుండి సస్పెండ్ చేసింది.

ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా… ఊరంతా తెలియడంతో మిగితా విద్యార్థుల తల్లిదండ్రులు వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తోటి విద్యార్థినిల పట్ల అలాంటి నీచపు ఆలోచనలు రావడం వారి క్రమశిక్షణకు అద్దం పడుతుందని పేరెంట్స్ అంటున్నారు. ఇలాంటి సంఘటలు మళ్లీ జరుగకుండా చూసుకుంటామన్న స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్లో చదువుతున్న అమ్మాయిల తల్లిదండ్రులతో పాటు 12 వేల మంది సంతకాలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed