- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో సరిపోను మందు పోయలేదని వరుడు మర్డర్
దిశ, వెబ్‌డెస్క్: పీకల దాక మద్యం తాగిన యువకులు ఇంకింత మద్యం కావాలని పెళ్లికొడుకును డిమాండ్ చేశారు. ఇప్పటికే ఫుల్లు అయిపోయారు, ఇంకా తాగితే ఇంటికి వెళ్లలేరు. పెళ్లి తర్వాత మరోసారి మంచి దావత్ చేసుకుందాం అన్న పెళ్లికొడుకును అతని ఫ్రెండ్స్ కత్తితో పొడిచి చంపారు. పెళ్లైన రెండు గంటల్లోనే నవ వరుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్‌లోని పాలీముకీంపూర్ గ్రామానికి చెందిన 28ఏళ్ల యువకుడు బబ్లూకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొన్ని నెలల క్రితం వివాహం నిశ్చయయింది. సోమవారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మ్యారేజ్ గ్రాండ్‌గా జరిగింది. తన పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ బబ్లూ మందు, మటన్ ఏర్పాట్లు చేశాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వరుడు బబ్లూ వెళ్లి ఫ్రెండ్స్‌ను కలవగా అప్పటికే పూటుగా మద్యం సేవించిన కొందరు యువకులు ఇంకింత మద్యం కావాలని డిమాండ్ చేశారు.
అయితే వరుడు మాత్రం తన ఫ్రెండ్స్‌తో ఇక ఇప్పటికీ మద్యం చాలని, మళ్లీ తర్వాత కలిసి మంచి పార్టీ చేసుకుందామని చెప్పగా.. మద్యం మత్తులో ఏం వినిపించుకోని అతని ఫ్రెండ్స్ పెళ్లికొడుకుతో వాగ్వాదానికి దిగారు. అందులో ఓ యువకుడు తన దగ్గర ఉన్న కత్తితో పెళ్లి కొడుకును పొడిచి పరారు అయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వరుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.