ట్రంప్‌పై గ్రెటా పంచ్..

by Shyam |
ట్రంప్‌పై గ్రెటా పంచ్..
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణ పరిరక్షణకు గళమెత్తిన స్వీడన్ బాలిక ‘గ్రెటా థెన్ బర్గ్’ పేరు అందరికీ సుపరిచితమే. కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న గ్రెటా గతేడాది స్వీడన్ పార్లమెంట్ ముందు ఒంటరిగా ధర్నాకు దిగి సంచలనం సృష్టించింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికల మీద గ్రెటా ప్రసంగించిది. పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి వేదిక మీదుగా గళం విప్పిన గ్రెటా ప్రస్తుత తరానికి స్ఫూర్తి కెరటం. పర్యావరణం విషయంలో ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే భూతాప నిరోధంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని, అది మన ప్రపంచానికి ప్రమాదకరమని, ఈ విషయంలో ట్రంప్ ప్రదర్శించిన తీరే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని మేల్కొలిపిందని, ఉద్యమానికి దారి తీసిందని గ్రెటా గతంలో ట్రంప్‌పై విమర్శలు చేసింది. తాజాగా మరోసారి ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ తన రివెంజ్‌ను తీర్చుకుంది గ్రెటా? ఇంతకీ గ్రెటాకు, ట్రంప్‌కు మధ్యమున్న వైరమేంటీ?

పర్యావరణ పరిరక్షణ కోసం గ్రెటా ఉద్యమిస్తున్న క్రమంలో పలు వేదికలపై తన గళాన్ని వినిపించిన గ్రెటా, వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ఐరాసలో మాట్లాడింది. తద్వారా ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. అంతేకాదు ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ 2019 పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గ్రేటా థెన్‌బర్గ్‌ని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ‘చాలా హాస్యాస్పదం. గ్రెటా తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక వర్క్ చేయాలి. అటు తర్వాత తన ఫ్రెండ్‌తో కలిసి పాత ఫ్యాషనైడ్ మూవీకి వెళ్ళండి! చిల్ గ్రెటా, చిల్’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఫలితాలను చూస్తే అగ్రరాజ్య పీఠంపై ఈ సారి జో బైడెన్ కూర్చునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేకపోతున్న ట్రంప్..పలు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలపై తన క్యాంపెయిన్ టీమ్‌తో పిటిషన్లు వేయించాడు. కోర్టులు ట్రంప్ పిటిషన్లు కొట్టేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రేటా థెన్‌బర్గ్ గతంలో తన యాంగర్ మేనేజ్‌మెంట్‌పై పంచ్‌లు వేసిన ట్రంప్‌కు ఈసారి తన టైమ్ వచ్చిందంటూ..గ్రెటా ట్రంప్ వాడిన పదాలతోనే..కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈట్వీట్ వైరల్‌గా మారింది.

‘చాలా హాస్యాస్పదం. ట్రంప్ తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక పనిచేయాలి. ఆపై ఫ్రెండ్‌తో కలిసి పాత ఫ్యాషనైడ్ మూవీకి వెళ్ళండి! చిల్ డొనాల్డ్, చిల్’ అని గ్రెటా ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed