- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిజిటల్ భావాలు..కనుమరుగైన గ్రీటింగ్ కార్డులు
అందమైన అక్షరాలు.. ఎదలోతుల్లోని భావాలు.. నోటితో చెప్పలేని మాటలు.. ఇలా సందర్భం ఏదైనా మనం ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పేది గ్రీటింగ్ కార్డు. పుట్టినరోజు, పెళ్లిరోజు, లవ్ ప్రపోజల్, లవర్స్ డే విషెస్, న్యూ ఇయర్ గ్రీటీంగ్, పండగ శుభాకాంక్షలు.. ఇలా ప్రతీ సందర్భానికి తగ్గట్టుగా మనసు లోతుల్లోని భావాలు చెప్పేది గ్రీటీంగ్ కార్డు. అందులో ప్రతీ భావం కూడా ఎంతో హృద్యంగా.. ఎదుటివారికి అర్థమయ్యేలా, వారిలో మనమీద ఇంప్రెస్ కలిగేలా అక్షరరూపం ఇచ్చేది గ్రీటీంగ్ కార్డ్.. ఒకప్పుడు ఓ వెలుగు వెలుగిన గ్రీటీంగ్ కార్డులు ఇప్పుడు కంటికి కానరకుండా పోయాయి.
దిశ, శేరిలింగంపల్లి : సెల్ ఫోన్ ఎఫెక్ట్ఇప్పుడు అంతా స్మార్ట్ ప్రపంచం. అరచేతిలో సెల్ చేరాక. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ప్రతీది అందుబాటులోకి వచ్చేసింది. చేతిలో సెల్, బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటే చాలు కూర్చున్న చోటు నుండే అన్నీ కొనే యచ్చు, అందరినీ కలవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏదైనా చేసేయొచ్చు. అందరికి ఫోనే ఇప్పుడు ప్రపంచంగా మారిపోయింది. సెల్ దెబ్బకు గ్రీటింగ్ కార్డులే కాదు, తోకలేని పిట్టలు ( ఉత్తరాలు ) సైతం మచ్చుకైనా కానరావడం లేదు. సెల్ లోనే సంక్షిప్త సందేశాలు పంపిస్తూ పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అక్కడి నుంచి కూడా అంతే ఫాస్ట్ గా రీప్లేలు వస్తుండడం, ఎదుటివారు హాయిగా మాట్లాడేస్తుండంతో ఉత్తరాలకు కాలం చెల్లింది. అంతేగాక వీడియో కాల్ అప్షన్స్ వచ్చాక ఒకరికి ఒకరు కలిసే పరిస్థితులు కూడా లేవు. అన్నీ వీడియో కాల్ లోనే చూస్తూ.. ఎదుటివారి యోగక్షేమాలు సైతం అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఉన్నా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుండడం కూడా ఈ గ్రీటింగ్ కార్డులు, ఉత్తరాలు కానరాకుండా పోయాయి. కొత్త ఉపాధి వెతుకున్న తయారీదారులుప్రతీ సీజన్, పండుగలకు తగ్గట్టుగా గ్రీటీంగ్ కార్డులను రూ పొందించి, వాటిని అందంగా తయారుచేసే తయారీదారులకు ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. ప్రత్యామ్నాయంగా వారు మరో ఉపాధిపై దృష్టి పెట్టారు. ఈరంగంలో దాదాపు ఎవరూ లేకుండా పోయారు. ప్రింటింగ్ ప్రెస్ లకు కూడా పెద్దగా పనులు లేకపోవడంతో వేర్వేరు రంగాలవైపు వెళ్లిపోయారు. క్రియేటివ్ రైటర్లకు, ప్రింటర్లకు, సరఫరాదారులకు ఇలా చాలా రకాలుగా ఉపాధి లభించేది. చాలాకాలంగా వీటికి డిమాండ్ లేకపోవడం వల్ల ఈరంగం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
కనుమరుగైన కార్డులు..
క్రిస్మస్ ముందు నుంచి గ్రీటింగ్ కార్డులతో శుభాకాంక్షలు వెల్లువెత్తేయి. ఇక న్యూ ఇయర్, సంక్రాంతి పండగలకు అయితే చాలా వరకు కార్డుల ద్వారానే శుభాకాంక్షలు తెలుపుకునే వారు. కానీ ఇప్పుడు అసలు వాటి ఊసేలేదు. ఏడాది పొడుగునా షాపుల్లో వేలాడి కనిపించే గ్రీటింగ్ కార్డులు ఇప్పుడు ఎక్కడా దొరకని పరిస్థితి.సందర్భానుసారంగా లభించే గ్రీటింగ్ కార్డులు ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదు. ఏ సందేశం పంపాలన్నా, ఏ విషయం చెప్పాలన్నా ఇప్పుడు అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్ ఉంటుంది. అందులోనే చెప్పాల్సిన విషయాలకు సంబంధించి సందేశాలు పంపుతారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా అనేక సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. కోపం, ప్రేమ, విచారం, బాధ, నవ్వు, ఏడుపు, శుభాకాంక్షలు ఇలా అనేక హావభావాలు వ్యక్తపరిచేలా ఎమోజెస్ అందుబాటులో ఉంటాయి. అన్నీంటికి ఓ షార్ట్ మెసేజ్ పెడుతూ ఎదుటి వారికి తాము చెప్పాలనుకున్న విషయాలను సామా జిక మాధ్యమాల వేదికగా చెప్పేస్తున్నారు. దీంతో గ్రీటింగ్ కార్డులు అనేవి కానరాకుండా పోయాయి.
అదంతా గతం..
మా చిన్నతనం నుంచి జనరల్ స్టోర్, బుక్ స్టాల్ నిర్వహిస్తున్నాం. మేము ప్రతీ సంవ త్సరం వేలాది గ్రీటింగ్ కార్డులను అ మ్మేవాళ్లం. వినియోగదారుడి అభిరుచికి అనుగుణంగా మావద్ద కార్డులు లభించేవి. కానీ దాదాపు 8సంవత్సరాల నుంచి కార్డులు అనే మాటనే లేదు. ఎవరూ అడగడం కూడా లేదు. ఈతరానికి గ్రీటింగ్ కార్డులు అంటే ఎలా ఉండేవో తెలియదు. అవన్నీ పాత జ్ఞాపకాలు.
-గంగారాం షాప్ యజమాని
ఇంకెక్కడి గ్రీటింగ్ కార్డులు..
గ్రీటింగ్ కార్డులు అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు, అంతా సెల్, సోషల్ మీడి యానే. గ్రీటింగ్ కార్డులు కొని పంపే ఓ పికా, తీరికా ఎ వరికి లేవు, టెక్నాలజీ పెరిగింది, అవన్నీ కనుమరుగయ్యాయి. ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు అందులోని భావాలు అవేవీ ఈ తరానికి తెలియదు. అంతా సోషల్ మీడియాలోనే విషెస్ తెలుపుకుంటున్నారు. కార్డులో ఉన్న అప్యాయత ఇప్పుడు పంపుతున్నా దాంట్లో కరువైంది.
-బంగారు రాజు