- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ ఎన్నికలు… భలే గిరాకీ..!
దిశ ప్రతినిధి, హైదరాబాద్, శేరిలింగంపల్లి : గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తుంది. గల్లీగల్లీ చుట్టేస్తూ గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరిలో స్థానికులకంటే కూడా రోజు కూలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. అన్ని పార్టీలు అడ్డా కూలీలను ఆశ్రయిస్తున్నాయి. ఇంతకాలం కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడిన నిరుపేదలకు ఎలక్షన్స్ కలిసి వస్తున్నాయి. రోజువారీ కూలీకంటే ప్రచారంలో పాల్గొంటూ రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నారు. నాయకులు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్లు అందజేస్తున్నారు.
జెండా కర్రలకు భలే గిరాకీ..
ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించేది ఆయా పార్టీల జెండాలే. వీటిని చేత పట్టుకుని ప్రచారం చేస్తేనే పలానా పార్టీ అభ్యర్థులు అని తెలిసేది. దీంతో ఎన్నికల సమయంలో జెండా కర్రలకు గిరాకీ ఉందని చెబుతున్నారు వ్యాపారులు. ఒక్కో పార్టీ అభ్యర్థికి 500 నుంచి వెయ్యి కర్రలను విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఆటో ప్రచారం..
గ్రేటర్ ఎన్నికలు ఆటో డ్రైవర్లకు ఎంతో కొంత ఉపాధిని ఇస్తున్నాయి. అన్ని డివిజన్లలో ప్రచారానికి అవసరమైన సామగ్రిని, కార్యకర్తలను తరలించడానికి, మైక్ ప్రచారాలకు ఆటోలను ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఆటోవారికైనా ఎన్నికలు కడుపు నింపుతున్నాయనే చెప్పాలి.
కరపత్రాలకు డిమాండ్..
ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ అభ్యర్థి తప్పనిసరిగా కరపత్రాలను విరివిగా ఉపయోగిస్తారు. అభివృద్ధి, చేయాల్సిన పనులు, ఇలా అన్నింటికి అక్షరరూపం ఇచ్చేది పాంప్లెట్స్. ఎన్నికల సమయంలో వీటి తయారీదారులకు చేతినిండా పని దొరికింది. ఇందులోనూ సైజ్ ను బట్టి, ప్రింటింగ్ ను బట్టి ధరలు ఉంటాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
హోటళ్లు, చాయి బండ్లకు గిరాకీ
ప్రచారంలో ఇళ్లు ఇళ్లు తిరిగి అలసిపోయిన కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు కాస్త ఊరట కోసం చాయ్ తప్పనిసరి. అలాగే, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాల్సిందే. ఇందుకు అందరు అభ్యర్థులు హోటళ్ల మీదనే ఆధారపడాల్సి వస్తోంది.
కళాకారులకు ఆదరణ కరువు
ఎన్నికలు అంటేనే కళాకారుల ఆటాపాట. అభ్యర్థులు వచ్చేకన్నా ముందే కళాకారులు ఆటపాటలతో జనాలను కట్టిపడేసేవారు. ఈసారి కళాకారులకు అంతంగా ఉపాధి దొరకడం లేదనే చెప్పాలి.