డీఆర్‌డీవో హైపర్‌సోనిక్ పరీక్ష సక్సెస్

by Anukaran |   ( Updated:2020-09-07 06:09:43.0  )
డీఆర్‌డీవో హైపర్‌సోనిక్ పరీక్ష సక్సెస్
X

దిశ, వెబ్‌డెస్క్: శక్తివంతమైన హైపర్‌సోనిక్ టెక్నాలజీ పరీక్ష (Hypersonic Technology Test)ను విజయవంతంగా పరీక్షించినట్టు కేంద్ర మంత్రి కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికల్ (Hypersonic Technology Demonstrator Vehicle)ను డీఆర్‌డీవో (DRDO) విజయవంతంగా పరీక్షించిందని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం వల దేశ సాంకేతిక రంగం కీలక ముందడుగు వేసిందని, దీనికోసం కృషి చేసిన శాస్త్రవేత్తలను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

డీఆర్‌డీవో శాస్త్రవేత్తల కృషికి దేశం గర్విస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ కలగన్న ఆత్మ నిర్భర్ భారత్‌ను ఈ విజయం నిజం చేస్తోందన్నారు. హైపర్‌సోనిక్ అధునాతన సాంకేతికతతో ఆయుధాలను సమకూర్చుకోవడంలో రక్షణ శాఖ, డీఆర్‌డీవో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విజయంతో స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ (Scramjet engine)ను ప్రయోగించిన నాలుగు దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. భూ వాతావరణంలో 30 కిలోమీటర్ల ఎత్తులో, ధ్వని వేగం కంటే 6 రెట్ల వేగాన్ని ఈ వెహికల్ కలిగి ఉంటుందని డీఆర్‌డీవో ఛైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story