- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టిందని.. ఆ కుటుంబం చేసిన పనికి
దిశ, వెబ్ డెస్క్: ఆడపిల్ల అంటేనే అరిష్టం.. దరిద్రం.. అవమానం అని అనుకునే రోజులు మారుతున్నాయి. ఇప్పుడున్న కాలంలో ఆడ, మగ సమానమే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలే కావాలనుకోవడం సంతోషించే విషయం. ఆడపిల్ల పుట్టిందని ఎంతోమంది సంబరాలు చేసుకోవడం చూసి ఉంటాం… ఊరంతా పిలిచి భోజనాలు పెట్టడం చూసి ఉంటాం.. కానీ ఇక్కడ మాత్రం తమకు ఆడపిల్ల పుట్టిందని ఒక్క గ్రామంలోనే తెలిస్తే సరిపోదు.. నలుగురు తమ గురించే మాట్లాడాలనుకున్నాడు ఒక వ్యక్తి. 35 సంవత్సరాల తర్వాత తన వంశంలో ఆడపిల్ల పుట్టిందన్న సంతోషంలో ఏకంగా హెలికాప్టర్ లోనే పుట్టిన చిన్నారిని ఇంటికి తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ అద్భుతమైన ఘటన రాజస్థాన్ లో సంచలనంగా మారింది.
రాజస్థాన్‌లోని నౌగౌర్ జిల్లాలోని నిమిబ్డి చందావతాకు చెందిన మదన్ లాల్ కుమ్హార్ కుటుంబంలో గత 35 ఏళ్లగా ఆడబిడ్డ జన్మించలేదు. ఆడబిడ్డ కోసం వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మదన్ లాల్ కుమ్హార్ కొడుకు హనుమాన్ ప్రజాపత్, చుంకి దేవి లకు గత నెల పండంటి ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆ కుటుంబలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాడు తాత మదన్ లాల్ కుమ్హార్. వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి విషయం చెప్పాడు. ఊర్లో హెలికాప్టర్ దిగడానికి కావాల్సిన అన్ని పర్మిషన్స్ తీసుకున్నాడు. అనంతరం కోడలు ఇంటి నుండి తమ ఇంటి వరకు ఒక హెలికాప్టర్బుక్ చేసి.. తన మనవరాలికి ఘనస్వాగతం పలికాడు. ఊరంతా పందిరి వేసి పండగలా చేశాడు. ఆడపిల్లలను పుట్టకముందే చంపేస్తున్న ఈ సమాజంలో ఒక ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకుంటున్న ఈ కుటుంబాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.