- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దిశ, హన్మకొండ టౌన్ : తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ సీ.ఐ. టీ. యూ అద్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12765 గ్రామ పంచాయతీలల్లో 36,000 వేల మంది సిబ్బంది కార్మికులు, పారిశుద్ధ్య, నర్సరీలు, వాటర్ సప్లై, వీధి దీపాలు నిర్వహణ, పన్నులు వసూళ్లు, ఆఫీస్ నిర్వహణ పనుల్లో వివిధ కేటగిరీలుగా పనులు చేస్తున్నారని తెలిపారు.
2019 ప్రభుత్వం జీవో నెంబర్ 51 ద్వారా 8500 రూ. వేతనాలుగా నిర్ణయించి అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మందికి ఒక్కరు చొప్పున సేవలు అందిస్తున్నా పనిభారంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం 2021 జనాభా ప్రాతిపదికన పని చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ. 8500 అందరికి అందడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పుల్ టైం, పార్టీ టైం సిబ్బంది, కంటెన్జెంట్ కార్మికులతో స్కీం వర్కర్స్‌లకు కూడా 11వ, పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచి అమలు చేస్తున్నారని కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం వేతనాలు పెంచడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం 15600 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల చక్రపాణి గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు బి. రమేశ్, ఆర్. సాంభయ్య, బరిగెల చంద్రయ్య, టి నరేష్, ఉప్పర రవి, బండి శంకర్ ,టి చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.