మక్కల కొనుగోలుపై ఆందోళ‌న వ‌ద్దు : మంత్రి పువ్వాడ

by Sridhar Babu |   ( Updated:2020-04-08 02:54:39.0  )
మక్కల కొనుగోలుపై ఆందోళ‌న వ‌ద్దు : మంత్రి పువ్వాడ
X

దిశ‌, ఖమ్మం: మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గిజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం వీవీపాలెం, అల్లిపురం, లచ్చగూడెం, పెద్ద గోపవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుంటేనే రాష్ట్ర బాగుంటుందని తద్వారానే అభివృద్ధి సాధించగలమన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది మక్కలు, వరి ధాన్యం విస్తారంగా పండాయ‌న్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలో గతంలో 96 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి 432 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.రైతులు ఎవరు తొందరపడకుండా సామాజిక దూరం పాటిస్తూ తమ పనులు తాము చేసుకోవాలని కోరారు. అన్న‌దాత‌ల‌ను ఆదుకొనే దిశ‌గా ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మ‌న్ బొర్రా రాజశేఖర్, ఆర్డీవో రవీంద్రనాథ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags: grain buying centers, opened, Minister Puvvada Ajay, khammam, Corporation

Advertisement

Next Story