- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘టీమిండియా వికెట్లు తీయడం పెద్ద కష్టం కాదు’
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన అనంతరం టీమ్ ఇండియాను బోల్తా కొట్టించడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై అప్పుడే మాజీలు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. మరో 10 రోజుల్లో ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియాతో తొలి టెస్టు ఆడనున్నది. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ టీమ్ ఇండియా బ్యాట్స్‌మాన్‌కు ఎలా బౌలింగ్ చేయాలో సలహాలు ఇచ్చాడు. ఇంగ్లాండ్ జట్టులోని జాక్ లీచ్, డామ్ బెస్ బంతిని మంచిగా టర్న్ చేస్తూ శ్రీలంకలో మంచి ప్రదర్శన చేశారు. వీరిద్దరూ కాస్త ఓపికగా బౌలింగ్ చేస్తే ఇండియాలో కూడా రాణించవచ్చని అంటున్నాడు. ‘ఇండియాలో మైదానాలు తొలి రోజు ఫ్లాట్‌గా ఉన్నా.. తర్వాత నెమ్మదించి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతాయి. బంతి మంచిగా టర్న్ అవుతుంది. కాబట్టి ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఓపికతో బౌలింగ్ చేయాలి. స్వదేశంలో టీమ్ ఇండియా క్రికెటర్లు ఎంత మంచిగా బ్యాటింగ్ చేసినా.. వారి వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాదు’ అని గ్రేమ్ స్వాన్ అంటున్నాడు. టీమ్ ఇండియా రోజు రోజుకూ మెరుగవుతుందని.. ఆ జట్టును ఎదుర్కోవాలంటే మరిన్ని ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసుకోవాలని స్వాన్ అభిప్రాయపడ్డాడు.