సర్కారుకు షాక్.. గౌరవెల్లి సందర్శనలో NGT కమిటీ సభ్యులు

by Shyam |
సర్కారుకు షాక్.. గౌరవెల్లి సందర్శనలో NGT కమిటీ సభ్యులు
X

దిశ, హుస్నాబాద్ : జాతీయ హరిత ట్రైబ్యునల్ త్రిసభ్య కమిటీ సభ్యులు బుధవారం సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. పర్యావరణ అనుమతి లేకుండా పనులు జరుగుతున్నాయని, 1.41 టీఎంసీలు ఉన్న సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారంటూ గూడాటిపల్లి గ్రామ సర్పంచి బద్దం రాజిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలైంది. విచారణలో భాగంగా 1. పీఎస్ కుటియాల్ సభ్యుడు జీఆర్‌ఎమ్‌బీ, 2. రమేష్ కుమార్ డైరెక్టర్ ఎం అండ్ ఏ, 3. డాక్టర్ ఇ అరోకియా లెనిన్, సైంటిస్టు ఇంటిగ్రేటెడ్ సీసీ ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రాజెక్టును పరిశీలించారు.

అనంతరం ఆర్డీవో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు అనుమతులు, నిర్మాణానికి సంబంధించిన వివరాలతో పాటు ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. ఆయకట్టు కింద 1.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కమిటీకి తెలిపామని అన్నారు. అనంతరం ప్రాజెక్టు కట్టను పరిశీలించి భూ నిర్వాసితుల అభ్యంతరాలను కూడా కమిటీ పరిగణలోకి తీసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్‌సీ బి.శంకర్, ఎస్ఈ సుమతిదేవి, ఈఈ రాములు, ఈఈ రమేష్, వెంకటేశ్వర్లు, ఆర్ఐ సురేందర్, డీఈఈలు, ఏఈఈలు ఎంపీటీసీ రవీందర్, సర్పంచి రాజిరెడ్డి, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

Advertisement

Next Story