- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నిటినీ..అనుమతించం!
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ కారణంగా ఆర్థికవ్యవస్థను కాపాడుకునేందుకు ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్ సడలింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే ఈ-కామర్స్ సంస్థలు డెలివరీల కోసం కసరత్తు మొదలుపెట్టాయి. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం శనివారం సాయంత్రం కొత్త ఆదేశాలను వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి అన్ని వస్తువుల పంపిణీకి అనుమతులు ఉండవని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 15న ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఈ-కామర్స్ సంస్థలు పూర్తీ స్థాయి సేవలను ప్రారంభించేందుకు అనుమతులుంటాయని చెప్పినప్పటికీ తర్వాత దీన్ని మార్చింది. తాజా ఉత్తర్వులలో..ఈ-కామర్స్ కంపెనీలకు అనుమతించే నిబంధనలను మార్చాలని హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. అవసరమైన ఉత్పత్తులను మాత్రమే పంపిణీకి అనుమతించాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే ఏప్రిల్ 20 నుంచి డెలివరీలను పునఃప్రారంభించడానికి సన్నద్ధమైన కంపెనీలకు ఇది నిరాశపరిచే వార్త. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు స్వంత నిబంధనలతో ఏప్రిల్ 20 నుంచి ఈ-కామర్స్ కంపెనీలకు పూర్తీ అనుమతులివ్వాలని నిర్ణయించాయి. కేంద్రం తాజా ఆదేశాలతో ఈ నిర్ణయాన్ని సవరించాల్సి ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా డెలివరీలు చేస్తామని స్నాప్‌డీల్ ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వం తాజా ఆదేశాలకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇంకా స్పందించలేదు.
Tags: amazon, E-commerce, Flipkart, Home Ministry