ప్రభుత్వ బీమా సంస్థలకు రూ. 3 వేల కోట్ల మూలధన సాయం

by Harish |
business
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్యంలోని సాధారణ బీమా కంపెనీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత త్రైమాసికంలో రూ. 3,000 కోట్ల మూలధనాన్ని అందించనుంది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఓఎల్‌సీఎల్), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఐసీఎల్), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(యూఐఐసీఎల్) మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు మూలధన సాయాన్ని అందించే ప్రతిపాదనను గతేడాది కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఎన్ఐసీఎల్‎కు రూ. 7,500 కోట్లు, యూఐఐసీఎల్, ఓఎల్‌సీఎల్‌లకు రూ. 5 వేల కోట్ల చొప్పున మూలధనాన్ని పెంచాలని గతేడాది కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాల అనంతరం అనుబంధ డిమాండ్‌లను ఆమోదించిన తర్వాత నిధుల సాయం చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed