- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండ్ల తోటల రైతులను ఆదుకోవాలి..
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో నష్టపోతున్న పండ్ల తోటల రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన ద్వారా పలు అంశాలను వెల్లడించారు. పంట కొనుగోలుకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చిన ప్రైయివేట్ వ్యాపారులు.. లాక్‌డౌన్ కారణంగా వెనక్కి తగ్గడంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి 50 శాతం పండ్లు అంతరాష్ట్రాలకు ఎగుమతి అవుతాయని, కానీ ఈ సారి విపత్కర పరిస్థితులతో చేతికి వచ్చిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకవేళ కొనుగోలు చేసినా.. అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ పరిస్థితులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పండ్ల రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags : Orchards, farmers, lockdown, export, compensation