- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
దిశ, వెబ్‌డెస్క్: సిమెంటు పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది. దాల్మియా భారత్ గ్రూప్ సీఎండీ పునీత్ దాల్మియా చైర్మన్‌గా నియమిస్తూ మొత్తం ఈ కమిటీలో 25 మంది సభ్యులు ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఎండీకేసి జన్వార్ కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ (డీసీసీఐ) పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రెండేళ్ల కాలపరిమితి ఉంటుందని అంతర్గత వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కమిటీ ప్రధానంగా సిమెంట్ పరిశ్రమలోని వ్యర్థాలను నివారించడం, గరిష్ఠ ఉత్పత్తిని సాధించడం, నాణ్యత పెంపు, ఖర్చుల తగ్గింపు, ఉత్పత్తి ప్రమాణాలను మెరుగుపరచడం లాంటి కీలక అంశాలపై మార్గాలను సూచిస్తుంది.
అలాగే, పరిశ్రమ పనితీరును మెరుగుపరచడం, సామర్థ్యం తక్కువున్న ప్లాంట్‌లపై నిర్ణయాలు-సిఫారసులు చేయడం, పరిశ్రమలోని కార్మికులకు ప్రత్యేక శిక్షణ, వారి భద్రతా ప్రమాణాలు, శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలు, కొత్త పరికరాలు, విధానాల అభివృద్ధి సహా ఇతర అంశాలపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. ఈ కమిటీలో.. శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్, జేకే సిమెంట్ డప్యూటీ ఎండీ మాధవ కృష్ణ, ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేష్ సింగ్, బిర్లా కార్పొరేషన్ సీఈఓ ప్రచెతా మజుందార్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సీఈఓ నీలేష్ నార్వెకర్ షా ఇతర సభ్యులున్నారు.