- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోకెన్ పద్ధతిన బియ్యం పంపిణీ
– బ్యాంకు ఖాతాలో రూ.1500 నగదు
దిశ, నిజామాబాద్: ప్రజలు కరోనా వైరస్ బారిన పడకూడదని ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండ్ల నుంచి ఎవరూ బయటికెళ్లే వీలు లేకపోవడంతో ప్రజలు పనులు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి శుక్రవారం నుంచి ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. అయితే ఈ పంపిణీ సమయంలో రేషన్ దుకాణాల వద్ద జనం పెద్ద ఎత్తున గుమిగూడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసింది. టోకెన్ పద్ధతితో పాటు ప్రతి ఒక్కరూ మూడు అడుగుల దూరం పాటించేలా చర్యలు చేపట్టింది.
ప్రభుత్వం ప్రకటించిన విధంగా రేషన్ కార్డు ద్వారా ఒక్కో సభ్యుడికి 12 కిలోల బియ్యంతో పాటు కుటుంబానికి నిత్యావసర సరుకుల కొనుగోలుకు రూ.1500 చెల్లించనుంది. ఉమ్మడి జిల్లాలో 1143 రేషన్ దుకాణాల ద్వారా ఈ బియ్యం పంపిణీ చేయనున్నారు. నగదు మాత్రం వారి వారి గ్యాస్ సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో జమచేయనున్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల చేశారు. ప్రతి రేషన్ దుకాణంలో ఈపాస్ మెషిన్ (బయో మెట్రిక్)పై వేలిముద్రలు తప్పనిసరి కావడంతో, అక్కడ వారికి చేతులకు శానిటైజేషన్ తప్పనిసరి చేశారు.
నిజామాబాద్ జిల్లాలో 15 లక్షల జనాభాకు 3,00,690 రేషన్ కార్డులు ఉండగా ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. 95 శాతం రేషన్ కార్డుల యజమానులకు ఖాతాలుండగా, మిగిలిన వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నగదు అందజేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లాకు కరోనా నిత్యావసర రేషన్ (రూ.1500 చెల్లింపులు) కోసం రూ.45 కోట్లు కేటాయించారు. కామారెడ్డి జిల్లాలో 10 లక్షల 45 వేల మంది జనాభా ఉంటే, వారిలో ఎనిమిది లక్షల 50 వేల మందికి 390 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని ఈపాస్ మెషిన్ వేలిముద్రల ఆధారంగా ఇచ్చేందుకు జీవో కూడా జారీ చేశారు. దీనిని ప్రభుత్వం పునరాలోచించి ప్రజల సౌకర్యార్థం మాన్యువల్‌గా ఇవ్వాలని కోరినా.. ప్రభుత్వం ససేమిరా అంది.
నిత్యావసర సరుకులు అర్హులకు సజావుగా అందాలంటే ఈ పాస్ బయోమెట్రిక్ విధానమే మేలు. అందుకు అనుగుణంగా కరోనా విస్తృతిని నిరోధించే చర్యలను పాటిస్తూ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Tags : Ration cards, Token System, Rice distribution, Poverty line, Sanitiser, Gas subsidy account