కఠిన ఈ-కామర్స్ నిబంధనలు తెచ్చే యోచనలో ప్రభుత్వం

by Harish |
కఠిన ఈ-కామర్స్ నిబంధనలు తెచ్చే యోచనలో ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఈ-కామర్స్ నిబంధనలను సవరించడానికి, కఠినమైన నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సవరణలను ప్రతిపాదించింది. కొత్త నిబంధనలు అమలైతే ప్రస్తుతం పలు ఈ-కామర్స్ సంస్థలు ప్రకటిస్తున్న ఫ్లాష్‌సేల్స్ నిషేధించబడతాయి. ఈ కొత్త ముసాయిదా ప్రకారం.. ఈ-కామర్స్ సంస్థలు వాటి ప్లాట్‌ఫామ్‌లో లేదంటే ఇతర మార్గాల్లో తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు, ప్రమోషన్‌లకు అనుమతి ఉండదు. అంతేకాకుండా, ప్రతి ఈ-కామర్స్ సంస్థ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు భారత్‌లో చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్‌ను నియమించాల్సి ఉంటుంది. కొత్త ముసాయిదాపై ఎన్నాళ్లుగానో కఠిన ఈ-కామర్స్ నిబంధనల అమలు కోసం ప్రయత్నిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఐఐటీ) సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story