- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టెలికాం రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు నోటిఫై చేసిన కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రంగంలో ఆటోమెటిక్ విధానంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. ఈ పెట్టుబడులు నిబంధనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆటోమెటిక్ విధానం ద్వారా 49 శాతం ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పెట్టుబడులు ప్రభుత్వం నుంచి ముందుగా ఆమోదం లభించిన తర్వాతే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) తెలిపింది. అంతేకాకుండా భారత్ సరిహద్దు దేశాలకు చెందిన కంపెనీలు, వ్యక్తులు ప్రభుత్వం ద్వారా మాత్రమే పెట్టుబడులు పెట్టాలని పేర్కొంది. 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించడం ద్వారా దేశీయ టెలికాం రంగంలో ఆమోద ప్రక్రియను సులభతరం చేయనుంది. అదేవిధంగా దేశీయ టెలికాం కంపెనీల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సమయాన్ని తగ్గిస్తుందని డీపీఐఐటీ వెల్లడించింది.