బడ్జెట్‌లో దేశీయ తయారీ ప్రోత్సాహానికి తగిన నిర్ణయాలు!

by Harish |
బడ్జెట్‌లో దేశీయ తయారీ ప్రోత్సాహానికి తగిన నిర్ణయాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా తయారీ, ఎగుమతులను ప్రోత్సహించే విధంగా కొన్ని రకాల ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని ఎత్తేయాలని, దీనికి సంబంధించి రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ తయారీని మరింత ప్రోత్సహించాలని లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా ఫర్నీచర్ ముడి పదార్థాలు, రాగి ఉత్పత్తుల్లో వాడే ముడిసరుకు, కొన్ని రసాయనాలు, టెలికాం పరికరాలు, రబ్బరు ఉత్పత్తులతో సహా అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించే అవకాశాలున్నాయని సమాచారం. ముడి పదార్థాలపై అధిక ధరలు ఉండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ ఉత్పత్తులపై ప్రభావం కనిపిస్తోంది. అంతేకాకుండా, దేశీయంగా ఫర్నీచర్ ఎగుమతులు సైతం తక్కువగా ఉన్నాయి.

అందుకోసమే ఫర్నీచర్ తయారీలోని ముడి పదార్థాలపై సుంకాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీటితో పాటు కట్, పాలిష్ చేసిన రత్నాలు, రబ్బరు వస్తువులు, తోలు వస్త్రాలు, టెలికాం పరికరాలు, కార్పెట్ వంటి 20కి పైగా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి ప్రభుతం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అదనంగా రాబోయే బడ్జెట్‌లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed