ఫేక్ డాక్యుమెంట్స్‌తో ప్రభుత్వ భూమికి ఎసరు..

by Sumithra |
fake documents
X

దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూమిని విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షేక్‌పేట మండలం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ఎదురుగా 27 ఎకరాల ప్రభుత్వ భూమిలో 9 ఎకరాల 17 గుంటలు తనదేనంటూ తిరుమల రాంచందర్ రావు, దరిపల్లి సంపత్, తిరుమల అవినాష్‌లు టౌన్ సర్వే అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు క్రియేట్ చేశారు. అందులో 2 ఎకరాల ల్యాండ్‌ను మిహిరా బిల్డ్ కాన్ మేనేజ్మెంట్ పార్టనర్ చాడ సుఖేష్ రెడ్డికి విక్రయించారు. ముందస్తుగా రూ.7 కోట్లను అడ్వాన్స్ చెల్లించిన చాడ సుఖేష్ రెడ్డి 2020 జూలై 4న అగ్రిమెంట్ రాసుకున్నారు.

ఆ తర్వాత ఈ ల్యాండ్‌ను బదిలీ చేయడంలో రాంచందర్ రావు, దరిపల్లి సంపత్, అవినాష్‌లు విఫలం కావడంతో అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.7 కోట్లను తిరిగి చెల్లిస్తానని చెప్పారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో బాధితుడు సుఖేష్ రెడ్డి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వైట్ కాలర్ డబ్ల్యూసీవో విభాగం ఏసీపీ వై.వెంకట్ రెడ్డి, ఇతర అధికారులను జాయింట్ సీపీ అభినందించారు.

Advertisement

Next Story