ఎయిర్ ఇండియాలో టాటాకు ఆసక్తి !

by Harish |
ఎయిర్ ఇండియాలో టాటాకు ఆసక్తి !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ విమానయాన దిగ్గజ సంస్థ ఎయిర్ ఇండియా వాటా విక్రయం కోసం మరోసారి గడువును పొడిగించబడింది. కరోనా వల్ల ఏర్పడిన ఇబ్బందుల కారణంగా బిడ్‌లు వేసేందుకు 2 నెలల గడువును పెంచాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పొడిగింపు వల్ల బిడ్‌లను వేసేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు అక్టోబర్ 30లోపు దాఖలు వేయొచ్చని తెలిపింది.

ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయ ప్రక్రియ జనవరిలో ప్రారంభించగా, అప్పటినుంచి నాలుగో సారి ప్రభుత్వం గడువును పెంచింది. అర్హత కలిగిన వారి బిడ్‌ల వివరాలను నవంబర్ 20 నాటికి వెల్లడించే అవకాశాలున్నాయని ప్రభుత్వం శాఖ దీపమ్(డీఐపీఏఎం) తెలిపింది. ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో వంద శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కొనుగోలుకు దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ ఆసక్తి చూపిస్తున్నట్టు, దీనికోసం అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టు ఇటీవల వార్తలు వినిపించాయి.

Advertisement

Next Story