వ్యాక్సిన్ సామర్థ్యం పెంచేందుకు రుణాలు మంజూరు చేసిన కేంద్రం

by Harish |
వ్యాక్సిన్ సామర్థ్యం పెంచేందుకు రుణాలు మంజూరు చేసిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు అవసరమైన రుణాలను మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. తద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌కు రూ. 3,000 కోట్లను, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్‌కు రూ. 1,500 కోట్ల రుణాలను కేంద్రం మంజూరు చేసింది.

త్వరలో ఈ మొత్తాన్ని కంపెనీలకు విడుదల చేయనున్నట్టు కేంద్రం తర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గతవారం సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదన్ పూనావాలా నెలకు 10 కోట్ల వ్యాక్సిన్ ఉతప్త్తిని సామర్థ్యాన్ని పెంచాలంటే రూ. 3 వేల కోట్ల రుణాలు కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రుణాన్ని మంజూరు చేసింది. ఈ ఏడాది జూన్ నాటికి సీరం ఇన్‌స్టిట్యూట్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే వీలుంది.

Advertisement

Next Story

Most Viewed