ఓయూలో అంగుళం కూడా కబ్జా కావొద్దు : గవర్నర్

by Shyam |   ( Updated:2020-06-03 12:03:20.0  )
ఓయూలో అంగుళం కూడా కబ్జా కావొద్దు : గవర్నర్
X

దిశ, న్యూస్ బ్యూరో: ఓయూ భూముల్లో అంగుళం కూడా కబ్జా కాకుండా కాపాడుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. న్యాయనిపుణుల సలహాలతో ఓయూ భూవివాదాలను కాపాడుకోవాలని సూచించారు. పూర్వవిద్యార్థులతో సమన్వయానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. ఓయూ అధ్యాపకులతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనివర్సిటీ భూముల వివాదంపై వివరాలు సమర్పించాలని ఓయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. ముందుగా ఇంటర్నల్ అసెసె‌మెంట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్నారు. కరోనా అనుభవాల దృష్ట్యా ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. సమగ్ర ప్రణాళిక, విధానాల నిర్ణయాలు అవసరమన్నారు. ఓయూలో ఉద్యోగ ఖాళీలు, వసతులు, భూవిదాలపై ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed