- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంతోష్ బాబుకు ఘన నివాళి
దిశ, మేడ్చల్: హకీంపేట్ ఆర్మీ ఎయిర్ పోర్టులో భారత్-చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహానికి పూలమాల వేసి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డిలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘లడఖ్ గాల్వన్ లోయ సమీపంలో భారత్ -చైనా మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లకు వందనాలు. జవాన్లు అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్శించి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎన్నటికీ మరువం. మాతృ భూమి సేవలో జాతి రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత మాత ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వీర సైనికుడు కల్నల్ సంతోష్ బాబుతో పాటు మిగతా వీరజవాన్లకు నివాళులు. ఆ సైనిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాo. వారి కుటుంబ సభ్యులకు ఈ వెలితిని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దేశ రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడవద్దు.. దేశమంతా ఒక్క తాటిపై నిలవాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తది. చైనా గానీ, మరే దేశంగానీ భారత్ సార్వభౌమత్వం విషయంలో వేలు పెడితే తప్పక ప్రతిఘటించి తగిన సమాధానం చెప్పాలి’ అని మంత్రులు అన్నారు.