- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఇకపై ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ జీవోలు
దిశ, ఏపీ బ్యూరో: అధికారికంగా విడుదలయ్యే జీవోలను ఆఫ్‌లైన్‌లోనే ఉంచాలన్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజలకు అందుబాటులో లేకుండా జీవోలను నిలిపివేయడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.
జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపివేయడం వల్ల సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, ఇతర అంశాలను, గోప్యంగా ఉంచాల్సిన అంశాలను కూడా ఈ-గెజిట్ లో ఉంచబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక నుంచి అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో జారీ అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.