దుండిగల్‌లో అక్రమ విల్లాలపై ప్రభుత్వం సీరియస్

by Shyam |
దుండిగల్‌లో అక్రమ విల్లాలపై ప్రభుత్వం సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: దుండిగల్ మున్సిపల్‌ పరిధిలోని మల్లంపేటలో అక్రమ విల్లాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. డిసెంబర్‌ ఎండింగ్ వరకు అక్రమ విల్లాలపై పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ బిల్డర్ పేరుతో 65 విల్లాలకే HMDA అనుమతి ఇవ్వగా.. అదనంగా 260 విల్లాలకు అనుమతి ఉన్నట్టు నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. మొత్తం 325 విల్లాల్లో 260 అక్రమ విల్లాలు ఉండటం గమనార్హం. దీంతో చర్యలకు దిగిన అధికారులు ఇప్పటికే 100 విల్లాలను సీజ్‌ చేశారు. ఇక మిగతా విల్లాలను కూడా అధికారులు సీజ్ చేయనున్నారు. ఇంత భారీ మొత్తంలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.

Advertisement

Next Story