ఆ సంస్థల ఉద్యోగులకు రూ. 10 లక్షల కరోనా ఎక్స్‌గ్రేషియా

by Harish |
ఆ సంస్థల ఉద్యోగులకు రూ. 10 లక్షల కరోనా ఎక్స్‌గ్రేషియా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం యాజమాన్యంలోని నాలుగు నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లోని సిబ్బంది మరణించే వారి నామినీగా ఉన్నవారికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంట్ల ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీల్లోని ఉద్యోగులకు కొవిడ్-19 ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయించినట్టు భారత సాధారణ బీమా ఉద్యోగుల సంఘం(జీఐఈఏఐఏ) అధికారులు చెప్పారు.

నాలుగు బీమా కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీఉ కరోనాతో మరణించిన ఉద్యోగుల నామినీకి రూ. 10 లక్షలను అందించనున్నట్టు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగి లేదా భాగస్వామి లేదంటే వారి పిల్లలు, తల్లిదండ్రుల కోసం స్టాఫ్ గ్రూప్ మెడి క్లెయిమ్ పాలసీ ద్వారా కవరేజీ అవ్వని వైద్య ఖర్చులను 100 శాతం తిరిగి చెల్లించనున్నట్టు ఓరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. పై నాలుగు ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు లభిస్తాయని’ జీఐఏఐఏ ప్రధాన కార్యదర్శి గోవిందన్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed