- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > విగలాంగులపై దాడికి ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నం.. ఇదేంటని ప్రశ్నిస్తే మీడియా ముందే..
విగలాంగులపై దాడికి ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నం.. ఇదేంటని ప్రశ్నిస్తే మీడియా ముందే..
X
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు పలు సమస్యలపై ఆర్డీవోకి వినతి పత్రం అందజేయడానికి ఆర్డీవో ఆఫీస్‌కి చేరుకున్నారు. అయితే.. ఆ సమయంలో ఆర్డీవో లేకపోవడంతో చాంబర్ ముందు విధులు నిర్వహిస్తున్న అటెండర్ నరేష్ వద్దకు వెళ్లి వారి వెంట తెచ్చుకున్న వినతిపత్రాన్ని ఎవరికి ఇవ్వాలి అని సైగలతో అడిగారు.
ఈ నేపథ్యంలో మాటలురాని వికలాంగులపై జాలి చూపించాల్సిందిపోయి.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఆ సమయంలో ఆర్డీవో లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకొని వివరణ కోరిన విలేకరుల ముందే.. అప్పుడు దాడి చేయలేదు, ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు దాడి చేస్తా అంటూ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.
Advertisement
Next Story