- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆకలితో.. రాత్రి నిద్ర లేకుండానే..
దిశ, న్యూస్ బ్యూరో: ‘మాది ప్రకాశం జిల్లా.. ఆరేండ్ల కింద నగరానికి వచ్చి బతుకుతున్నాను. వచ్చిన పని చేసుకొని సంపాదించుకుని తింటున్నాను. ఇప్పుడు మేస్త్రీ పనులు చేసుకుంటున్నాను. తొమ్మిది నెలలుగా మెట్రో స్టేషన్ కిందనే ఉంటున్నాను. ప్రభుత్వం పెట్టే బువ్వ, ఎవరో ఒకరు పెట్టే దానితోనే ఇప్పుడు కడుపు నింపుకుంటున్నాను. మంగళవారం రోజు అన్నం పెట్టే టైమ్‌కు నేను లేను. రోజంతా ఆకలిగా ఉంది. రాత్రి ఓ సామాజిక కార్యకర్త విషయం తెలుసుకొని భోజనం వండుకుని తెచ్చారు. అలా కాలం వెల్లదీస్తున్నాం..’ ఇది ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ్ రావు లాక్‌డౌన్ రోజుల్లోని ఆకలి ప్రస్థానం.
వలస కూలీలు రాష్ట్ర అభివృద్ధిలో భాగమే.. వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించి నెల రోజులు, లాక్‌డౌన్ విధించి నెల రోజులకు పైగానే.. అయినా నగరంలో పేదలు, వలస కూలీలు ఆకలితో కడుపు పట్టుకుని రాత్రిళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు. ప్రభుత్వమిచ్చే 12 కిలోల బియ్యం, రూ.500 ఇస్తామని ప్రకటించినా సాయమందడం లేదని వలస కూలీలు రోజూ తహశీల్దార్, సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నారు. మరో వైపు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసి అభాగ్యులను, వలస కూలీలను అందులో ఉంచి అన్నం పెడుతున్నారు. కార్మికులకు వారి బిల్డర్ల వద్దనే అన్నం పెట్టే విధంగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోన్నది. నిత్యం మిట్టమధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వలస కూలీలు తమ గమ్యస్థానాలను వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అన్నపూర్ణ పథకం కింద రోజూ రెండు పూటల భోజనాన్ని బల్దియా అందిస్తోన్నది. తాత్కాలిక షెల్టర్లలో ఉండేవారికి కూడా ఇదే భోజనాన్ని ఇస్తున్నారు. రోడ్ల మీద ఉన్న అందరికీ తామే భోజనం అందిస్తామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చెప్పుకొంటుంది. అయినా రోడ్ల మీద జనాలు తగ్గడం లేదు. జీహెచ్ఎంసీ షెల్టర్లలో ఉంటే తమకు కూడా కరోనా ఎక్కడ వస్తుందోననే భయంతో రోడ్ల మీదనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేక టీంలను కేటాయించి నిరంతరం పనిచేస్తున్న రోడ్ల మీద ఉండే వలస కూలీలు, పేదలు అక్కడే ఉంటున్నారు. రోడ్ల మీద కుక్కలతో సహవాసం చేస్తున్నారు. ఏదో ఆ పూటకొచ్చే దానధర్మాలతో కడుపులు నింపుకుంటున్నారు. లేదంటే పస్తులతోనే పడుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు వారి యజమానుల చేతుల్లో దెబ్బలు పడుతున్నాయి. పని ప్రదేశాలు వదిలేసి వారంతా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఫుట్‌పాత్‌లు, మెట్రో స్టేష్లన్లు వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. లాక్‌డౌన్ నెల రోజులు ముగిసినా పేదల బతుకులకు ఒక్క పూట భోజనం దొరుకుతుందనే భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోన్నది. లెక్కల్లో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా ఆకలితో రాత్రిళ్లు నిద్ర లేకుండా గడుపుతున్న పేదలకు, వలస కూలీలకు చిరునామాగా కనిపిస్తోన్నది.
మా ఇంటింకి పంపించండి: ధర్మేంధర్ కుమార్, ఉత్తర ప్రదేశ్
ఏడాది కింద మల్లేపల్లికి వచ్చి చెరుకు బండి పనిచేస్తున్నాను. లాక్‌డౌన్‌తో అన్ని పనులు ఆగిపోయాయి. మా యజమాని కనీసం ఇంటికి ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదు. అడిగితే నన్ను కొట్టారు. అక్కడి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. నేను పనిచేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఫుట్‌పాత్ మీదనే పడుకుంటున్నాను. ఎవరైనా కార్లల్లో వచ్చి తినేందుకు ఇచ్చి వెళ్తున్నారు. అన్నం, బిస్కెట్లు ఇస్తున్నారు. వాటితోనే నేను కడుపు నింపుకుంటున్నాను. ఆయన దగ్గర ఇంక నేను పనిచేయను. దయచేసి నన్ను మా ఊరికి పంపించండి.
అక్కడ ఏమీ బాగుండవు: మాధవ రావు, ప్రకాశం జిల్లా
అన్నపూర్ణ, దాతలు పెట్టే అన్నం తినే బతుకుతున్నాం. జీహెచ్ఎంసీ వాళ్లు షెల్టర్లు పెట్టిన మాట నిజమే కానీ.. అక్కడ ఏవీ సరిగా ఉండవు. వచ్చిన వస్తువులను కూడా అక్కడ పనిచేసే వాళ్లే పట్టుకెళ్తున్నరు. మాకేమీ మిగిల్చడం లేదు. అన్నపూర్ణ భోజనంలో కూడా ఉప్పు, కారం కూడా ఉండవు. కానీ, కడుపు నింపుకోవాలి. బతుకాలంటే తప్పదు గదా.. ఏదో ఒకటి తిని కాలం గడుపుతున్నాం. ఆ షెల్టర్లలో ఉండేదానికంటే దొరికినపుడు తిని లేనపుడు పడుకుంటే బతుకుతామన్న ధైర్యమన్నా ఉంటది.
Tags: Lockdown, Telangana, GHMC, Migrant Labour, Meals