పేదింటి బిడ్డల పెండ్లికి సర్కారు సాయం -వికారాబాద్ ఎమ్మెల్యే

by Shyam |
పేదింటి బిడ్డల పెండ్లికి సర్కారు సాయం -వికారాబాద్ ఎమ్మెల్యే
X

దిశ, రంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పేదప్రజల పక్షపాతిగా వారి సంక్షేమానికి నిత్యం పాటుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ధారూర్ మండలకేంద్రంలోని స్త్రీ శక్తి భవన్ లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సమయంలో పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా అన్ని వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాలతో ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story