‘రైతుల ఆదాయం పెంచడమే సర్కార్ లక్ష్యం’

by Aamani |   ( Updated:2020-05-23 07:23:06.0  )
‘రైతుల ఆదాయం పెంచడమే సర్కార్ లక్ష్యం’
X

దిశ, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్‌ సాహసోపేత చర్యలతోనే వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి ప్రారంభమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని దివ్య గార్డెన్‌లో ‘నియంత్రిత పద్దతిలో పంటల సాగు’పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టిపెట్టేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. మార్కెటింగ్‌ను దృష్టిలో పెట్టుకొని డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ, ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed