గూగుల్‌‌లో ‘ఆటోమేటిక్‌ హిస్టరీ డిలీట్’ ఫీచర్

by vinod kumar |
గూగుల్‌‌లో ‘ఆటోమేటిక్‌ హిస్టరీ డిలీట్’ ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్ :

సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్.. కొత్తగా గూగుల్ (మెయిల్‌)‌ ఉపయోగించేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. లొకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమేటిక్‌గా డిలీట్ కానుంది. ఆ మేరకు సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు.

ఇప్పటివరకు గూగుల్ హిస్టరీ డిలీట్ చేయాలంటే.. మాన్యువల్‌గా చేసేవాళ్లం. కానీ ఇక నుంచి అది ఆటోమేటిక్‌గా జరగనుంది. అయితే ఇది గూగుల్ అకౌంట్ కొత్తగా వాడటం మొదలు పెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని గూగుల్ తెలిపింది. ‘గూగుల్ నుంచి ఏదైనా ప్రొడక్ట్‌ను రూపొందించేటప్పుడు ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, బాధ్యతాయుతంగా ఉండటం, నియంత్రణలో ఉంచడం. ఈ విషయంలో యూజర్లకు మరింత భద్రతను కల్పించడం కోసం గూగుల్ ఓ సరికొత్త ఆవిష్కరణను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చింది. ఇక నుంచి గూగుల్ యూజర్ హిస్టరీ 18 నెలల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యూజర్ల సెట్టింగ్స్‌ను గూగుల్ మార్చబోవడం లేదు. పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని’ సుందర్ పిచాయ్. తెలిపారు. ఈ ఆటోమేటిక్‌ డిలీట్‌ ఆప్షన్‌ జీ మెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌కు వర్తించదని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed