- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ ఫొటోలకు ‘3డీ’ ఎఫెక్ట్
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి..ఫొటోలు, సెల్ఫీలకు లెక్కలేకుండా పోయింది. ఫొన్‌లోనే ఆ ఫొటోలు స్టోర్ చేయాల్సి వస్తే.. ఫోన్ వెంటనే హ్యాంగ్ అయిపోతుంది. అందుకే ఎన్ని ఫొటోలు దిగినా..వాటిని సేఫ్‌గా ‘గూగుల్ ఫొటోస్’లో భద్రపరుస్తుంటాం. ఈ నేపథ్యంలో గూగుల్..కస్టమర్ల కోసం ఓ అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది.
ఒక్కసారి గూగుల్ ఫొటోస్ తలుపు తడితే..తలపులోకి వచ్చే మధుర జ్ఞాపకాలెన్నో. కొన్ని సంవత్సరాల క్రితం మనం తీసుకున్న ఫొటోలను గుర్తు చేసే గూగుల్ ఫొటోస్‌లో, మరో హంగు చేరింది. అదే ‘సినిమాటిక్ ఫొటోస్’. ఈ ఫీచర్ సాయంతో సాధారణ ఫొటోలు కూడా 3డీ ఎఫెక్ట్‌తో కనిపిస్తాయి. మెషిన్ లెర్నింగ్ ఆధారంగా ఫొటో డెప్త్‌ను అంచనా వేయడం వల్ల ఇది సాధ్యం కాగా, కొత్త కొలాగ్ డిజైన్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. దీంతో ఫొటోలకు రిచ్‌నెస్ పెంచే ఆర్టిస్టికల్ డిజైన్డ్ లేఅవుట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
గూగుల్ ఫొటోస్‌లో ఇప్పటి వరకు ఫొటోలను స్టోర్ చేసుకునే మెమొరీ మీద ఎలాంటి పరిమితి విధించలేదు. ఐదేళ్లుగా ఉచితంగా ఫొటోలు స్టోర్ చేసుకునే సర్వీస్ అందించింది. కానీ, జూన్ 1, 2021 నుంచి కేవలం 15 జీబీ వరకే ఫొటోలను స్టోర్ చేసుకునేలా పరిమితి విధించినున్నట్లు ఇటీవల వెల్లడించింది. గూగుల్ డ్రైవ్ కొత్త పాలసీ నిబంధనల్లో భాగంగా ఈ పరిమితిని అమలు చేయనున్నారు.