వారికి గుడ్ న్యూస్.. గూగుల్‌మీట్‌లో కొత్త ఫీచర్

by Shyam |
వారికి గుడ్ న్యూస్.. గూగుల్‌మీట్‌లో కొత్త ఫీచర్
X

దిశ, ఫీచర్స్ : పాండమిక్ సమయం నుంచి ‘వీడియో కాలింగ్’ యాప్స్‌కు ఆదరణ పెరగగా, గూగుల్ మీట్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్స్‌ను యాడ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వీడియో కాల్స్ సమయంలో డిమ్ లైటింగ్‌ను సరిచేయడానికి ‘వీడియో లైటింగ్ అడ్జస్టె‌మెంట్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

వీడియో కాల్ టైమ్‌లో యూజర్ తక్కువ ఎక్స్‌పోజ్ చేయబడితే ఈ ఫీచర్ వెంటనే గుర్తించి విజిబిలిటీ పెంచడానికి బ్రైట్‌నెస్ పెంచుతుంది. ప్రస్తుతానికి డెస్క్‌టాప్, ఐవోఎస్ పరికరాల్లో మాత్రమే ఈ సెట్టింగ్ అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ ‘వీడియో లైటింగ్ అడ్జస్ట్‌మెంట్’ ఎనేబుల్ చేయడం వల్ల కంప్యూటర్ స్పీడ్ ప్రభావితమైతే దీన్ని ఆఫ్ చేసుకునే వీలుంది. ఈ ఫీచర్ అన్ని గూగుల్ వర్క్‌స్పేస్ కస్టమర్లతో పాటు జీ సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. కాగా రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ ఈ సేవలందుతాయని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఫీచర్‌కు 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం అవుతుందని పేర్కొంది.

గూగుల్ మీట్ గతేడాది ఐవోఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్‌కు దాని AI టెక్నాలజీని ఉపయోగించి తక్కువ లైట్ మోడ్‌ను జోడించింది. సబ్-ఆప్టిమల్ లైటింగ్ పరిస్థితుల్లో ఇతర పార్టిసిపెంట్ల విజువల్స్ ఉత్తమంగా కనిపించేందుకు AI.. వీడియోను సర్దుబాటు చేస్తుంది. అదేవిధంగా, వీడియో కాన్ఫరెన్స్ వంటి సమయాల్లో అంతరాయాలను పరిమితం చేయడానికి, AI నాయిస్ ఫిల్టర్ ఫీచర్‌ను జోడించింది.

Advertisement

Next Story

Most Viewed