ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్లకు వేళాయే!

by srinivas |
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్లకు వేళాయే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లపై ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలనే విషయంపై జగన్ సర్కార్ సూత్రపాయంగా అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయం వలన సుమారు 1000 మందికి పైగా లబ్ది చేకూరనుంది. అధికారుల స్థాయిలో తక్కువ.. ఉద్యోగులు, కార్మికుల స్థాయి వారికి ప్రమోషన్లు ఎక్కువగా దక్కనున్నట్టు సమాచారం. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యత నెలకొంది.

Advertisement

Next Story