వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే..!

by Shyam |
వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే..!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ప‌ట్టణాభివృద్ధిలో మ‌రో ఆణిముత్యం జ‌త‌కానుంది. వ‌రంగ‌ల్ అర్బన్‌ జిల్లా కాజీపేట మండ‌లం మ‌డికొండ ప్రాంతంలో హైటెక్స్ నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువ‌డ్డాయి. ఈ నెల14న రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీజ‌యేష్ రంజ‌న్ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేశారు. మ‌డికొండ ఐటీ పార్కుకు స‌మీపంలో మూడు న‌క్షత్రాల హోట‌ల్‌, క‌న్వెన్షన్ ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు, మిత్రుడైన‌ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి కృషి ఫ‌లించింది. హైటెక్స్ నిర్మాణ మంజూరుకు సంబంధించి పోచంప‌ల్లి కొంత‌కాలంగా చేస్తున్న ప్రయ‌త్నాలు చివ‌రికి ఫ‌లించాయి.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర రెండో రాజ‌ధానిగా ఉన్న వ‌రంగ‌ల్ ప‌ట్టణం వైపు ఇప్పుడిప్పుడే ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. మ‌డికొండ ఐటీ పార్కులో మూడు మ‌ల్టీనేష‌నల్ కంపెనీలు న‌డ‌స్తుండ‌గా.. మ‌రికొన్ని ఒప్పందం కుదుర్చుకుని రావ‌డానికి సిద్ధంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఐటీ కంపెనీల ఉద్యోగులు, ప్రతినిధుల‌కు అనుగుణంగా మౌలిక వ‌స‌తుల క‌ల్పన‌, సౌక‌ర్యాల క‌ల్పన చేప‌డితే వ‌రంగ‌ల్‌లో ఐటీ ప‌రిశ్రమ విస్తర‌ణ‌కు దోహదం చేయ‌డంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతాయ‌ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Next Story