తెలంగాణ రైతులకు శుభవార్త

by Anukaran |
Telangana farmers
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులతో పాటుగా ఇంతకుముందు రైతు బీమా చేసుకోని రైతులు ఈ ఏడాది రైతు బీమా (రైతు మరణిస్తే వచ్చే రూ. 5 లక్షల బీమా) చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 12లోగా సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు.

నియమ నిబంధనలు :

– రైతు పేరిట భూమి 03.08.2021లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
– రైతులు 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అంటే 14.08.1962 నుండి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి.
– వయస్సు పక్కాగా ఆధార్ కార్డ్ ప్రకారమే తీసుకుంటారు. అందులో ఎలా ఉంటే అదే ప్రామాణికం.
– ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది.
– రైతే స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను ఏఈఓలకు అందించాలి.
– ఏఈఓ, ఎంఏవో అధికారుల లాగ్ ఇన్ నుండి 12.08.2021లోగా ఎల్​ఐసీకి పంపించాల్సి ఉంటుంది. అందుకే రైతులు ఈ నెల 11లోగా దరఖాస్తులను అధికారులకు అందించాలి.
– ఈ సమయంలోగా బీమా కోసం దరఖాస్తు చేసుకోకుంటే వచ్చే ఏడాది వరకు అవకాశం ఉండదు. అనివార్య కారణాలతో ఏదైనా ప్రమాదం జరిగి రైతు మరిణిస్తే తర్వాత బీమా రాదు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.

Advertisement

Next Story

Most Viewed