ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

by Shyam |
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో అందరికీ తెలుసు. ఆయన ఒక్కో సినిమాకు తీసుకునే గ్యాప్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసినా.. అప్పుడప్పుడు షోల్లో కనిపిస్తూ అలరింపజేస్తాడు. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. అంతేగాకుండా తెలుగు ఆడియన్స్‌కు ఏ మాత్రం తెలియని ఈ రియాల్టీ షోను తన స్టామినాతో ఎన్టీఆర్ సక్సెస్ చేసాడు. దీంతో తాజాగా జెమిని టీవీ ఓ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ సరికొత్త షోకు ఎన్టీఆర్ యాంకర్‌గా వ్యవహరిచేందుకు సిద్ధం చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేగాకుండా ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ షోకు సంబంధించిన సెట్‌ కూడా రెడీ చేస్టున్నట్టు సమాచారం. అయితే ఈ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు తారక్ షరతులను జెమిటీ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు హోస్ట్ చేయడానికి తారక్‌కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. మరి దీనిపై తారక్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇది నిజం అయితే తారక్ శుభవార్తే.

Advertisement

Next Story