బలరాం నాయక్‌కు గుడ్‌న్యూస్.. ఈసీ కీలక నిర్ణయం

by Shyam |
Former Union Minister Balaram Naik
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా వేసిన అన‌ర్హత వేటును తొల‌గిస్తూ తాజాగా ఎన్నిక‌ల సంఘం బుధ‌వారం ప్రక‌ట‌న జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో ఈసీ అనర్హత వేటు వేసింది. మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభకు, శాసనమండలికి పోటీచేయ‌రాద‌ని గ‌తంలో జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. అయితే, తాజాగా.. బలరాం నాయక్‌పై అర్హత వేటును సెప్టెంబ‌ర్ 13 వ‌ర‌కే కుదిస్తూ నిర్ణయం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story