కీర్తి ‘గుడ్ లక్ సఖి’పై మేకర్స్ క్లారిటీ

by Shyam |
కీర్తి ‘గుడ్ లక్ సఖి’పై మేకర్స్ క్లారిటీ
X

దిశ, సినిమా : నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘గుడ్ లక్ సఖి’. నగేష్ కుమార్ డైరెక్షన్‌లో ఫిమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన సినిమాలో హీరో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీ రోల్స్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ కొంతకాలంగా రిలీజ్ వాయిదాపడుతూ వస్తోంది. నిజానికి మేకర్స్ జూన్ 3న రిలీజ్‌కు ప్లాన్ చేసినా.. పాండమిక్ పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు.

ఈ నేపథ్యంలో ‘గుడ్ లక్ సఖి’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందనే రూమర్స్ హల్ చల్ చేస్తుండగా నిర్మాత సుధీర్ చంద్ర ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఓటీటీలో రిలీజ్ అవుతుందనే పుకార్లలో నిజం లేదని తెలిపిన ఆయన.. ఇలాంటి ప్రచారం మానుకోవాలని మీడియాను కోరారు. సినిమా రిలీజ్ తేదీ గురించి సాధ్యమైనంత త్వరలో అప్‌డేట్ ఇస్తామని తెలిపారు. కోప్రొడ్యూసర్ శ్రావ్య వర్మ సైతం ఈ ఓటీటీ రిలీజ్ వార్తలను కొట్టిపారేశారు. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రజెంట్ చేస్తుండటం విశేషం.

Advertisement

Next Story