- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యావరణ ప్రేమికుడు గోళ్ళ భూపతిరావుకి గౌరవ డాక్టరేట్
దిశ, భద్రాచలం : గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షుడు గోళ్ళ భూపతిరావు డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ అనుబంధ చెన్నై శాఖ, వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపర్చిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేసింది. పర్యావరణంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న భూపతిరావును గౌరవ డాక్టరేట్ పురస్కారానికి యూనివర్శిటీ సెనేట్ ఎంపిక చేసింది. ఆ మేరకు పాండిచ్చేరి నగరంలోని షేన్‌బాగ్ కన్వెన్షన్ హాల్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చైర్మెన్ డాక్టర్ పి. మేన్యూల్, గౌరవ అతిథి, రిటైర్డ్ జడ్జి మురుగన్ భూపతి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సంపత్ కుమార్, రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ షణ్ముగ సుందరం, డాక్టర్ సిఆర్ భాస్కరన్ (చెన్నై), డాక్టర్ ఆర్ దానపల్లి (న్యూడిల్లీ) వారి నుంచి భూపతిరావు ఈ పురస్కారం అందుకున్నారు.
గోళ్ళ భూపతిరావు గత పదేళ్ళుగా పర్యావరణంలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ సేవలు, వివిధ సంస్ధలకు చేయూత, కోవిడ్ తీవ్ర రూపం దాల్చిన సమయంలో బాధితులకు చేసిన సహాయం, పార్క్‌ల ఏర్పాటు, ఉద్యాన రైతులకు పలు సలహాలు సూచనలు అందించి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆ ప్రయాణంలోనే ఇపుడు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
డాక్టరేట్‌తో బాధ్యత మరింత పెరిగింది
ఈ సందర్భంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ.. ఈ పురస్కారం ద్వారా తనమీద మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. అలాగే తనతో పయనిస్తున్న మిత్రులు ఏగి సూర్యనారాయణ, రంగారావు, శంకర్‌రావు, రాజిరెడ్డి, వైవి గణేష్, దేశప్ప, శ్రీనివాసరెడ్డి, తిరుమలరావు, కామిశెట్టి కృష్ణార్జునరావు, నాగరాజు, శ్రీదేవీ తదితర మిత్రులకు, శ్రేయోభిలాషులకు భూపతిరావు అభినందనలు తెలిపారు.