వందే భారత్ విమానంలో భారీ స్మగ్లింగ్

by Anukaran |   ( Updated:2020-07-04 05:38:25.0  )
వందే భారత్ విమానంలో భారీ స్మగ్లింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతుంటే .. మరోవైపు స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అదే అదునుగా భావించిన స్మగ్లర్లు ఇండియాకు అక్రమంగా బంగారం తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కస్టమ్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వారిపై డేగ కన్నేసి మరీ పట్టుకున్నారు. వివరాల్లోకివెళితే.. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా 14 మంది వ్యక్తులు రస్-ఉల్-కేమా( యూఏఈ), సౌదీ అరేబియాలోని రియాద్‌ నుంచి జైపూర్ చేరుకున్నారు. వీరంతా రెండు చార్టర్ విమానాల ద్వారా జైపూర్ విమానాశ్రయంలో లాండ్ అయ్యారు. వీటిల్లో వచ్చిన 14 మంది వ్యక్తుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 31.9918 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.15.67 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed