ఎయిర్‌పోర్టులో 8.45 కేజీల బంగారం పట్టివేత

by Sumithra |   ( Updated:2021-01-23 21:04:01.0  )
ఎయిర్‌పోర్టులో 8.45 కేజీల బంగారం పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. దీంతో వారి బ్యాగుల్లో గుర్తించిన 8.45 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ.4.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని తరలిస్తున్న నలుగురు మహిళలతో సహా తొమ్మిది మంది అరెస్ట్ చేశారు. మొత్తం 18 మంది దగ్గర బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story