బంగారం భగ భగ!

by Harish |
బంగారం భగ భగ!
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారానికి రెక్కలొచ్చాయి. వంద రెండోందలు కాదు ఏకంగా రూ. 1200 పెరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ క్షీణించకూడదని అమెరికా ఫెడ్ రేటులో కోత విధించడంతో యూఎస్ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ కారణంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇండియాలో కరోనా కేసులు నమోదు కావడం, రూపాయి మారకం విలువ బలహీనపడటంతో దేశీయ కమొడిటీ మార్కెట్లో మంగళవారం ఒక్కరోజే రూ. 1,200 వరకూ పెరిగిన బంగారం, ప్రస్తుతం పది గ్రాములు రూ. 43,397 వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఫెడ్..అత్యవసర స్థితిగా వడ్డీ రేటులో కోత అర్ధ శాతం తగ్గించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్లు పెరిగి ప్రస్తుతం ఔన్స్ బంగారం 1,640 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, పది గ్రాముల బంగారం ధర రూ. 44,000 దాటే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రూపాయి మారకం విలువ 43 పైసలు దిగజారి 16 నెలల కనిష్ఠంతో రూ. 73.19కి నమోదు చేసింది.

Tags: Multi Commodity Exchange, Gold April 2020 Futures, Retail Gold, Covid-19 Infections, Spot International Experts, Gold Prices, Novel Coronavirus Outbreak

Advertisement

Next Story