తగ్గిన బంగారం…పది గ్రాములు రూ. 41 వేలకు దిగువన!

by Harish |
తగ్గిన బంగారం…పది గ్రాములు రూ. 41 వేలకు దిగువన!
X

మ్మయ్య…బంగారం దిగొచ్చింది. గత కొన్నాళ్లుగా భగభగమంటూ ధరల వేడిలో కాగుతున్న పసిడి ఎట్టకేలకు కాస్త నెమ్మదించింది. చాలారోజుల తర్వాత బంగారం రూ. 41 వేలకు దిగువన నమోదైంది. దీంతో వినియోగదారులు కాస్త ఊరట ఇచ్చినట్టే అని అభిప్రాయపడుతున్నారు. ముహుర్తాల సమయం కావడంతో 41 వేలకు దిగి రావడం కాస్త సంతోషాన్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

వరుసగా మూడు రోజులు పాటు తగ్గడంతో ప్రస్తుతం బంగారం ధర పది గ్రాములు రూ. 40,871 వద్దకొచ్చింది. ఆభరణాల తయారీదారులు పెద్దగా డిమాండ్ చేయకపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో దేశీయంగా ధరల తగ్గుదలపై ప్రభావం చూపించిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. వెండి సైతం కొంత నెమ్మదించింది. రూ. 179 తగ్గడంతో కిలో వెండి రూ. 46,881 కి చేరింది. వెండి ధర తగ్గడానికి నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు క్షీణించడమే కారణం. రెండ్రోజుల క్రితం బంగారం రూ. 281 తగ్గగా, మరుసటిరోజు మళ్లీ మరో రూ. 388 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో లోహాల ధరలు సైతం తగ్గాయి.

Advertisement

Next Story