- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన బంగారం దిగుమతులు..
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయని వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ. 51,438.82 కోట్ల విలువైన బంగారం దిగుమతులు జరిగినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో వాణిజ్య లోటు రూ. 1.58 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో బంగారం దిగుమతుల విలువ రూ. 599 కోట్లకే పరిమితమైంది. వెండి దిగుమతులు సైతం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో 93.7 శాతం తగ్గి రూ. 204 కోట్లకు చేరుకున్నట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి.
బంగారం దిగుమతులు పెరిగిన నేపథ్యంలో వెండి డిమాండ్ క్షీణించినట్టు మంత్రిత్వ శాఖ అభ్బిప్రాయపడింది. ఈ కారణంగానే వాణిజ్యలోటు రూ. 1.58 లక్షల కోట్లుగా నమోదైందని, గతేడాది ఇదే సమయంలో వాణిజ్య లోటు రూ. 73.5 వేల కోట్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా బంగారం దిగుమతుల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. సాధారణంగా ప్రతి ఏటా భారత్ 800-900 టన్నుల బంగారం దిగుమతు చేసుకుంటోంది. ఇక, సమీక్షించిన రెండు నెలల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు రూ. 47 వేల కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో వీటి ఎగుమతులు 8 వేల కోట్లుగా నమోదయ్యాయి.