81 శాతం తగ్గిన బంగారం దిగుమతులు

by Anukaran |   ( Updated:2020-08-16 08:20:09.0  )
81 శాతం తగ్గిన బంగారం దిగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం (Financial year) ఏప్రిల్-జులై మధ్య కాలంలో బంగారం దిగుమతు (Import of gold)లు 81.22 శాతం క్షీణించి సుమారు రూ. 18,590 కోట్లకు పడిపోయాయి. కొవిడ్-19 (kovid-19) కారణంగానే దిగుమతులు తగ్గాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ (Ministry of Commerce) గణాంకాలు స్పష్టం చేశాయి.

గతేడాది ఇదే సమయంలో బంగారం దిగుమతుల (Gold imports) విలువ రూ. 91,440 కోట్లుగా ఉన్నాయి. పసిడితో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వెండి దిగుమతులు సైతం 56.5 శాతం తగ్గి సుమారు రూ. 5,185 కోట్లకు చేరుకున్నాయి. బంగారం, వెండి (Gold, silver) దిగుమతుల క్షీణత (Decline in imports) దేశ వాణిజ్య లోటు (Country trade deficit)ను తగ్గించడంలో సహాయపడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దిగుమతులు, ఎగుమతుల (Imports, exports) మధ్య వ్యత్యాసం ఏప్రిల్-జులై మధ్య కాలంలో 13.95 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 59.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2019, డిసెంబర్ నుంచి బంగారం దిగుమతులు ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తున్నాయి. మార్చిలో 62.6 శాతం, ఏప్రిల్‌లో 99.93 శాతం, మే నెలలో 98.4 శాతం, జూన్ నెలలో 77.5 శాతం ప్రతికూలతను నమోదు చేసినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు (Ministry of Commerce Statistics) వెల్లడించాయి. ఇక, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్-జులై నెలల్లో 66.36 శాతం తగ్గి 4.17 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed